Posts

Showing posts from 2017
ప్రస్థానం (ఆదర్శ బాలుని ఆత్మకథ'వ్యథ') నేను ఆరవ తరగతి చదువు తున్నాను. ఇక్కడ ఇంగ్లీషు మీడియం ఉందని మా ఊళ్ళో బడి ఉన్నా నన్ను ఇక్కడ చేర్చాడు మా నాన్న. సూర్యునితో పాటు నేనూ బయలు దేరతాను. స్కూలుకు రావాలంటే రెండు బస్సులు మారాలి. పొరపాటున ఒకబస్సు అందుకోలేకపోతే ఆ రోజు సెలవే. సైకిలేసుకు రావడానికా అంతదూరం నేను తొక్కలేనని మా నాన్న వద్దంటాడు. సెలవొస్తేనే కడుపు నిండా తిన్నట్లు. స్కూలుంటే ఉరకలు పరుగులతోనే జీవితం. ప్రక్కన హై స్కూల్లో చదివే నా స్నేహితుడు ఈ విషయంలో చాలా అదష్టవంతుడు. ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్ కి వెళతాడు. అదీ ఒక్క బస్సులోనే. 9.30 ఆడుతూ పాడుతూ చేరుకుంటాడు.           నాది తినే వయసంట. మా అమ్మ చెప్తూ ఉంటది. కానీ నాకు తినడానికి సమయమే లేదు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా..నే చెప్పేది నిజమే ఉదయాన్నే ఆరు గంటలకు చద్దన్నం తిని బయలుదేరతానా, మ ళ్ళీ అన్నం మొహం చూసేది మధ్యాహ్నం 1.10 కే, సార్లు కదా మధ్యలో మీకైతే ఆకలి వెయ్యదేమో, నాకు మాత్రం కడుపులో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నంత బాధ కలుగుతుంది. ఆకలితో ఉన్నప్పుడు మనస్సు పాఠాలమీద కంటే వంట షెడ్డులో కుతకుతలాడే అన్నం మీదే ఉంటుంది. నాకు ప...
*స్వప్న కథ* ప్లాష్...ప్లాష్.... *మోడల్ స్కూళ్ళు పాఠశాల విద్యలో విలీనం.* *తొలగనున్న  జీతాలకష్టాలు* *010 హెడ్ ద్వారా జీతాల చెల్లింపుకు ముఖ్యమంత్రి అంగీకారం* *వెంటనే హెల్త్ కార్డుల ఉత్తర్వులివ్వమని అధికారులకాదేశం* *ఉపాధ్యాయ వర్గంలో మిన్నంటిన సంబరాలు.* ఎట్టకేలకు మోడల్ స్కూల్ బాలారిష్టాలు తీరనున్నాయి. ముఖ్యమంత్రి చొరవతో చిరకాలం పెండింగ్ లో ఉన్న సమస్యలు తొలిగిపోయాయి...ఈనాడు  యాహూ.... యాహూ..... నా కష్టాలు పోయాయోచ్. యా...హూ... ఏవండోయ్ మాస్టారు లేవండి నిద్దట్లో ఏంటా పలవరింతలు. మీ అరుపులకి పిల్లలు నిద్రలే స్తారు.అంటూ భార్య పిలుపుతో  మెలకువ వచ్చింది సుందరం మాస్టారికి. వచ్చింది కలా.. నిజమైతే ఎంత బాగుండు. యథాలపంగా బయటకు అనేసాడు సందరం మాస్టారు. ఏంకలొచ్చిందండి. నాక్కూడా కొంచెం చెబ్దురూ.. గోముగా అడిగింది భార్య. చాలా అందమైన కల ముఖ్యమంత్రి తియ్యని మాటలు , ఉపాధ్యాయుల ముఖాల్లో చిరునవ్వు..ఆహా.. అంటూ తన్మయంగా చెప్పటం ప్రారంభించాడు మాస్టారు. ముగించేసరికి తెల్లవారింది. ఏదో కొత్త ఉత్సాహం ఆవరించటంతో ఇక నిద్రపట్టక లేచినోట్లో పందెంపుల్ల వేసుకొని అటు ఇటు తిరుగుతూ న్యూస్ పేపర్ కోసం ఎదురుచూ...

Service regularization application

Image

3rd AGI proceedings 5.7.17

Image